తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-5 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షో లో పాల్గొని ఎంతో మంది ఫేమ్ సంపాదించారు. అయితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో పాటు కొందరి మధ్య చిచ్చు రేపిందని కొందరి వాదన. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్ బాస్ అగాధం సృష్టించింది. ఈ షో వల్ల సిరి-శ్రీహాన్ జంటల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చినా వాళ్లు వాటిని క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీప్తి సునయన-షణ్నూలు మాత్రం సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
వాలెంటైన్స్ డే సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి ‘బీబీ జోడీ ఈవెంట్’ అంటూ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేశారు. ఇందులో షణ్నూ అదిరిపోయే పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన ప్రేమ పరిస్థితికి తగ్గట్లుగానే ‘మై లవ్ ఈజ్ గాన్’ అంటూ డ్యాన్స్ వేశాడు. ఈషో కి యాంకర్ గా ఉన్న రవి.. షణ్నూని కొన్ని ప్రశ్నలు అడిగాడు. “మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావు, నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బై అని ఎవరికి చెబుతావు” అంటూ ప్రశ్నలు సంధించాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలకు షణ్నూ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చాడన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. మరి ఈ ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.