‘బిగ్‌బాస్ 5 తెలుగు’లో ఎప్పుడు ఏ ట్విస్ట్, ఎప్పుడు ఏ టాస్క్ అన్నది ఎవరూ కనుక్కోలేరు. అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు కూడా అలాగే వస్తారు. బిగ్‌బాస్ కాల్ రాగానే మొత్తం పాత వీడియోలు అన్నీ చూసేసి బాగా ప్రిపేర్ అయి వస్తారు. వాళ్లు అసలు క్యారెక్టర్ బయటకు తీసుకురావడమే బిగ్ బాస్ గేమ్ ప్లాన్. నామమాత్రపు అంచనాలతో హౌస్‌లోకి ఎంటర్ అయ్యి అబ్బా ఏమ్ గేమ్‌రా బాబు అనే రేంజ్‌లో ఉంది యాక్టర్ ప్రియ గేమ్. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో.. ఎవరిని దగ్గరకు తీసుకుంటుంది? ఎవరికి చురకలు వేస్తుంది అన్న అంచనానే లేకుండా ఆడుతోంది. మరి నటి ప్రియ గేమ్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
ప్రియ హౌస్‌లో అందరితో దాదాపుగా స్నేహపూర్వకంగానే ఉంటుంది. ఏదో ఒక్కరో ఇద్దరితో మినహా. అందరితోనూ ఒకేలా ఉండటం కూడా ప్రియకు కలిసొచ్చే పాయింట్. కొన్ని సందర్భాల్లో హౌస్‌లో మీరంతా ఒక గ్రూపు.. గ్రూపులుగా ఆడుతున్నారు అనే కామెంట్లు వస్తుంటాయి. అలాంటి సందర్భంలో ప్రియను కామెంట్ చేసే అవకాశం లేకుండా పోతుంది.
బిగ్‌బాస్ హౌస్‌లో 106 రోజుల్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్‌ను జనాలకు చూపించాలి అన్నది కాన్సెప్ట్. సాధారణంగా ఎవరూ కూడా తెలిసిన అందరితో చనువుగా ఉండరు. అదే ప్రియ కూడా చేస్తోంది. కొందరితోనే తను చనువుగా అన్నీ షేర్ చేసుకునేలా వ్యవహరిస్తోంది. అంటే నేను నటించడం లేదు. నేను నేనులాగానే ఉన్నా అని అర్థం వచ్చేలా అనమాట. అది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న అంశం.
మనం ఎప్పుడూ మనకు నచ్చని వారికి దూరంగా ఉంటాం. అదే ప్రియ కూడా చేస్తోంది. ఇంట్లో ఎవరితో అయితే తనకు ర్యాపో లేదో వారికి దూరంగా ఉంటోంది. సన్నీతో ప్రియకు బ్యాటర్న్ టాస్క్‌తో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతివారం ఏదొక రీజన్‌తో సన్నీని నామినేట్ చేస్తూనే ఉంది. తాజా నామినేషన్స్‌లో సన్నీ స్నేహితులను కాపాడుకుంటున్నాడు అని తన అసలు ఇంటెన్షన్‌ను బయట పెట్టింది.
ఇంట్లో చాలా మంది కారణం లేకుండా గొడవ పడటం.. అకారణం ఏడవడం.. ఊరికే అరవడం చాలా సందర్భాల్లో చూశాం. కానీ, ప్రియ మాత్రం ఎప్పుడూ తన ఎమోషన్స్‌ని బాలెన్స్‌డ్‌గా ఉంచుకుంటోంది. కోపం వస్తేనే అరవడం.. నింద పడితేనే రియాక్ట్ అవ్వడం చేస్తోంది.
ప్రియ మొదటి నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందేమో అనే అంచనాతో వచ్చింది. అంచనాలకు మించి రాణించింది.. రాణిస్తోంది కూడా. ఇప్పుడప్పుడే ప్రియ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె కంటే ఎంతో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి.. ప్రియ టాప్- 5 కంటెస్టెంట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నటి ప్రియ గేమ్ ఎలా ఆడుతోంది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.