ఇటీవలే సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మరణాలు వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు తీరని విషాదాన్ని నింపుతుంది. ఆత్మహత్యలు, గుండె పోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్య సమస్యలు వంటి వాటితో మరణిస్తున్నారు. ఇప్పటికే పలువురి ప్రముఖల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకోగా.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఇంట కూడా చోటుచేసుకుంది.
ఇటీవలే సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మరణాలు వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు తీరని విషాదాన్ని నింపుతుంది. ఆత్మహత్యలు, గుండె పోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్య సమస్యలు వంటి వాటితో మరణిస్తున్నారు. ఇటీవలే ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలానే ఆదివారం డ్యాన్స్ మాస్టర్ చైతన్య నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంట విషాదం చోటుచేసుకుంది.
విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇంట విషాదం చోటుచేసుకుంది. మల్లాది విష్ణు మాతృమూర్తి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చాగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు మల్లాది విష్ణు నివాసనికి చేరుకుంటున్నారు.
అలానే ఆయన కుటుంబ సభ్యులకు సంఘీ భావం తెలుపుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లాది విష్ణు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజవర్గం నుంచి బొండ ఉమపై పోటీ చేసి గెలుపొందారు. అలానే ఆయన ప్రజలతో నిత్యం మమేకమవుతూ..వారిసమస్యలు పరిష్కరించే వారు. ఇలా తమ నేతకు మాతృవియోగం కలగడంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మల్లాది విష్ణు తల్లి మృతిపై మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.