Chandrababu And Vasireddy Padma: విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించటానికి శుక్రవారం జీజీహెచ్‌కు వెళ్లారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జీజీహెచ్ వస్తున్నాడన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలు వాసిరెడ్డిని చూశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని దాటుకుని ఆమె లోపలకు వెళ్లారు. బాధితురాలితో మాట్లాడుతూ ఉండగానే.. చంద్రబాబు నాయుడు అక్కడకు వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, వాసిరెడ్డి పద్మల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చంద్రబాబు ఈ ఘటనపై వాసిరెడ్డి పద్మను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. తాము కూడా బాధితులకు అండగా నిలుస్తున్నామని, నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె బదులిచ్చారు. కొద్దిసేపటి తర్వాత పంచుమర్తి అనురాధతోనూ వాసిరెడ్డి వాగ్వివాదానికి దిగారు. సంయవనం పాటించాలని చంద్రబాబు అనురాధకు సూచించారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు.
కాగా, శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి మానసిక దివ్యాంగురాలైన యువతిపై అత్యాచారం చేశాడు. జీజీహెచ్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న అతడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ దారుణంగా పాల్పడ్డాడు. ఆ ముగ్గురు ఆసుపత్రి గదిలో యువతిని బంధించి మూడు రోజుల పాటు నరకం చూపించారు. మిస్సింగ్ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రిలో యువతిని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ సీఐ, సెక్టార్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘‘జోకర్’’ వేషంలో నర హంతకుడు.. మగాళ్లే టార్గెట్.. 33 మందిని దారుణంగా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.