Chandrababu And Vasireddy Padma: విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించటానికి శుక్రవారం జీజీహెచ్‌కు వెళ్లారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జీజీహెచ్ వస్తున్నాడన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలు వాసిరెడ్డిని చూశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని దాటుకుని […]