ఓ భవనం పై నుంచి కిందపడటంతో ఓ నాగుపాముకి గాయాలయ్యాయి. ఆ పామును పట్టుకుని స్నేక్ క్యాచర్ వైద్యం చేయించాడు . డాక్టర్ సునీల్ గాయపడిన పాముకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు.
సాధారణంగా ఎవరికైనా అనారోగ్యల సమస్యలు ఉంటే ఆస్పత్రిలో జాయిన్ చేస్తారు. అక్కడ వైద్యులు రోగి చెప్పే విషయాలను, అతడి రిపోర్ట్ లను పరిశీలించి చికిత్స అందిస్తుంటారు. అలానే ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి శస్త్ర చికిత్స చేసి వైద్యులు కాపాడుతుంటారు. అయితే ఓ వైద్యుడు మనుషులకే కాక ఏకంగా నాగు పాముకే శస్త్రచికిత్స చేసి.. దాని ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పాము కనిపిస్తే చాలు చాలా మందికి భయంతో పరుగులు తీస్తారు. మరికొందరు వాటి వెంటపడి దాడి చేసి మరీ చంపేస్తారు. ఇంకా అవి తీవ్రగాయాలతో కనబడితో కొందరు మరింత కొట్టి చంపేస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే విష సర్పాలకు కూడా వైద్యం చేసి ప్రాణాలు పోస్తుంటారు. ఆ వర్గానికి చెందిన వ్యక్తే విశాఖపట్నంకి చెందిన ఓ వైద్యుడు. విశాఖపట్నంలోని గాజువాక పట్టణంలో ఓ ప్రాంతంలో ఆరడుగుల పొడవున్న నాగు పాము స్థానికులకి కనిపించింది. అయితే ఆ పాము తీవ్రవంగా గాయపడి ఉంది.
ఆ పాము పెద్ద భవనం పై నుంచి జారిపడి గాయలైనట్లు ఆ స్థానికులు గుర్తించారు. భవనంపై నుంచి పడిపోవడంతో అక్కడి నుంచి కదల్లేని నిస్సాహాయ స్థితిలో ఆ పాము ఉండిపోయింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. పాములను పట్టే వారు అక్కడికి చేరుకుని పామును పరిశీలీంచారు. భవనం పై నుంచి పడిపోవడంతో తీవ్రగాయాలు అవ్వడంతో.. తమకు తెలిసిన వైద్యం చేశారు. అనంతరం మల్కాపురం పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్ వద్దకు వెళ్లారు. చాలా సమయం పాటు ఆ పామును పరిస్థితిని గమనించిన వైద్యుడు.. చికిత్స అందించాలని భావించారు.
దాదాపు గంటపాటు సర్జరీ చేసి పాము తలభాగంలో కుట్లు వేశారు. వివిధ రకాల మందులు పాముకు వేసి కాసేపు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం పాము ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు సునీల్ తెలిపారు. నాగపాముకు సర్జరీ చేయడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసక్తికరంగా మారింది. పాములకు కూడా సర్జరీ లు చేస్తారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ఘటన ఒకటి ఒడిశాలో జరిగింది. అక్కడ తీవ్రంగా గాయపడిన కింగ్ కోబ్రాకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.