మనం నిత్యం తినే అల్పాహారాల్లో ఇడ్లీకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇడ్లీలు ఎంత ఆరోగ్యకరమైన ఆహారమో మనకందరికీ తెలుసు.. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇడ్లీకి ఉంటే ప్రాధాన్యమే వేరుగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గరనుంచి.. ముసలివాళ్ల దాకా అందరూ ఇడ్లీని ఇష్టంగా తింటారనడంలో సందేహం లేదు. అయితే ఒక్కో ప్రాంతంలో ఇడ్లీలు ఒక్కో రకంగా చేస్తుంటారు.. ఇడ్లీ ఆకారాల్లో కూడా ఈ మద్య చాలా రకాల వెరైటీలు చేస్తున్నారు. ఈ అల్పాహారం సులభంగా జీర్ణమవుతుంది అంతేగాక పోషకాలతో నిండి ఉంటుంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ తో తన అనుబంధం వుందని గుర్తుచేసుకున్నారు. ఏయూ హాస్టల్ నుంచి తెల్లవారు జామున స్టేషన్‌కు వచ్చి వేడివేడి ఇడ్లీలు తినేవారమన్నారు. విశాఖపట్నం తన జీవితాన్ని బాగా ప్రభావితం చేసిందని, రాజకీయాలకు ఇక్కడే బీజం పడిందన్నారు. విశాఖపట్నం వస్తే ఆనందంగా ఉంటుందని, ఇక్కడి ప్రజలు మంచివారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్పెషల్ డిష్ ను నెటిజన్లకు పరిచయం చేశారు.
విశాఖపట్నంలో చిట్టెం సుధీర్ అనే యువకుడు చిన్న తోపుడు బండి ద్వారా తయారు చేస్తున్న టేస్టీ టేస్టీ స్పెషల్ ఇడ్లీని జనానికి తెలియజేశారు. రాగి, ఇతర సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని సూచించారు. ‘ఈరోజు ఉదయం ‘వాసెనపోలి’ వారి రాగి, జొన్న, ఇతర సిరిధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని ఆరగించాను. చాలా రుచిగా అనిపించాయి. ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. సిరిధాన్యాలతో సాంప్రదాయ పద్ధతిలో ఇలాంటి మంచి టిఫిన్ ను అందిస్తున్న విశాఖపట్నం యువకుడు చిట్టెం సుధీర్ కు అభినందనలు’. వినూత్న ఆలోచనలతో మన సంప్రదాయ ఆహారపద్ధతులను యువత అలవాటు చేసుకోవాలి’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Had a sumptuous breakfast of millet idlis today made by ‘Vasena Poli’ stall run by a young agri-entrepreneur Chittem Sudheer in Visakhapatnam. With a rich flavour and taste, such millet based food offer a healthy and organic alternative to our diet. pic.twitter.com/REFDDRTDA7
— Vice President of India (@VPSecretariat) November 24, 2021