న్యూజిలాండ్ తో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో పరుగుల వరద పారించింది టీమిండియా. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సారథి రోహిత్ శర్మ లు సెంచరీలతో చెలరేగడంతో 385 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యతో బరిలోకి దిగిన కివీస్ 295 పరుగులకు కుప్పకూలింది. జట్టులో డెవాన్ కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్ లతో 138 పరుగులతో చెలరేగినప్పటికీ న్యూజిలాండ్ ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ గెలుపుతో సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. దాంతో వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ప్రణాళికలకు తగ్గట్లుగానే ఆడి వరుసగా రెండు సిరీస్ లు గెలిచామని పేర్కొన్నాడు.
2023 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా రెచ్చిపోతోంది. వరుగా సిరీస్ లు కైవసం చేసుకుంటూ.. వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మెున్న శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లను గెలిచిన భారత్.. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 3-0 తో క్లీస్ స్వీప్ చేసింది. దాంతో వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ టీమిండియా ఆటగాడిని ఆకాశానికి ఎత్తేశాడు. అతడు భారత జట్టులో ఓ మెజిషియన్ అని ప్రశంసించాడు. ఒత్తిడి యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో పరీక్షించడానికే చాహల్, ఉమ్రాన్ ను తుది జట్టులోకి తీసుకున్నామని రోహిత్ పేర్కొన్నాడు.
రోహిత్ మాట్లాడుతూ..”ప్రణాళికలకు తగ్గట్లుగా రాణించడంతోనే వరుసగా రెండు సిరీస్ లు సాధించాం. అయితే మేం నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోవడం ఆనందమే. కానీ మేం ర్యాంకింగ్స్ గురించి పట్టించుకోం. ఇక జట్టులో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీమిండియాలో శార్దూల్ ఠాకూర్ ను అందరు మెజిషియన్ అంటారు. అందుకు తగ్గట్లుగానే అవసరం వచ్చినప్పుడల్లా.. అతడు బ్యాట్ తోనూ బంతితోనూ రాణిస్తాడు. ఈ మ్యాచ్ లో సైతం కీలకమైన దశలో మూడు వికెట్లు తీశాడు.” అంటూ శార్దూల్ పై ప్రశంసలు కురిపించాడు రోహిత్.
Shardul ‘Magician’ Thakur 🎩 #INDvNZ
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2023
ఇక సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ సాధించడం ఆనందంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. శుభ్ మన్ గిల్ ఆట ప్రతీ మ్యాచ్ లో ఒకే విధంగా ఉంటుంది అని కొనియాడాడు. జట్టులో ప్రతీ ఒక్కరు పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నారని, వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది శుభసూచకం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కివీస్ పై సిరీస్ విజయంతో టీమిండియా వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది టీమిండియా. మరి రోహిత్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.