ప్రస్తుతం టీమిండియా.. మంచి జోష్ లో ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది భారత్. ఇక మంగళవారం నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పైగా వన్డే సిరీస్ కు విరాట్, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు కూడా యాడ్ అయ్యారు. దీంతో టీమిండియా ఇంకా పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా బౌలర్ పై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా. ఆ బౌలర్ ను చూస్తూంటే.. టీమిండియా దిగ్గజ బౌలర్ గుర్తుకు వస్తున్నాడని కితాబిచ్చాడు. ఇలాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారని ప్రశంసించాడు.
జవగళ్ శ్రీనాథ్.. 90ల్లో టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నెముకగా నిలిచాడు. ఇతడు బౌలింగ్ కు దిగితే.. ఎంతటి బ్యాటర్ అయినా తోక ముడవాల్సిందే. అలాంటి బౌలర్ నే ప్రస్తుతం నేను టీమిండియా జట్టులో చూస్తున్నాను అంటున్నాడు భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా. ప్రస్తుతం శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతమై బౌలింగ్ చేసిన ‘జమ్మూఎక్స్ ప్రెస్’ ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు జడేజా. ప్రముఖ క్రీడా సైట్ క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ జడేజా మాట్లాడుతూ.. “ఉమ్రాన్ మాలిక్ ను చూస్తుంటే నాకు టీమిండియా దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ గుర్తుకు వస్తున్నాడు. శ్రీనాథ్ కూడా గతంలో ఇదే స్పీడ్ తో బౌలింగ్ చేసి వికెట్లు నేలకూల్చేవాడు. మళ్లీ అలాంటి బౌలర్ ను ఇప్పుడే చూస్తున్నా. అదీకాక అతడిలో ఏదో ప్రత్యేకమైన స్కిల్ ఉంది. దానిని భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఉమ్రాన్ లాంటి బౌలర్లు వరల్డ్ క్రికెట్ లో చాలా అరుదుగా ఉంటారు” అని పొగడ్తలతో ముంచెత్తాడు అజయ్ జడేజా.
ఇంకా డెత్ ఓవర్లలో రాణించే సత్తా ఉమ్రాన్ లో ఉందని జడేజా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా టెయిలెండర్లు క్రీజ్ లో ఉన్నప్పుడు ఉమ్రాన్ ను బౌలింగ్ కు పంపిస్తే.. కచ్చితంగా వికెట్లు తీస్తాడు అని అజయ్ జడేజా తెలిపాడు. ఇక లంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల్లో 7 తీసి సత్తా చాటాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ కూడా ఉమ్రానే కావడం విశేషం. తాజాగా ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ లో కూడా ఉమ్రాన్ ఇదే విధంగా రాణిస్తే.. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. లంకతో జరిగే తొలి వన్డేకు జట్టులో చేరనున్నారు సీనియర్లు విరాట్ కోహ్లీ, రాహుల్, రోహిత్ శర్మలు.
#UmranMalik emerged as the highest wicket-taker in the three-match T20I series vs #SriLanka 🔥
Ajay Jadeja & @joybhattacharj heap praise on the bowler, on Cricbuzz Live#INDvSL pic.twitter.com/0H56l7ux4l
— Cricbuzz (@cricbuzz) January 9, 2023