ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది, విలువైనది మరొకటి లేదు. ఏ స్వార్ధం లేకుండా మనల్ని కాపాడుతూ, కంటికి రెప్పలా చూసేది ఒక్క అమ్మ మాత్రమే. ఆమె ప్రేమ త్యాగానికి సిద్ధపడుతుందే కానీ త్యాగాని కోరుకోదు. తాను కష్టపడుతూ.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణాలను ఫణంగా పెడుతుంది. అలాంటి ఘటనే శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.
ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది, విలువైనది మరొకటి లేదు. ఏ స్వార్ధం లేకుండా మనల్ని కాపాడుతూ, కంటికి రెప్పలా చూసేది ఒక్క అమ్మ మాత్రమే. ఆమె ప్రేమ త్యాగానికి సిద్ధపడుతుందే కానీ త్యాగాని కోరుకోదు. తాను కష్టపడుతూ.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పిల్లలకు ఏదైనా అపాయం జరిగినప్పుడు.. వారిని కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డు వేస్తుంది. ఇప్పటికే బిడ్డలను కాపాడబోయి తల్లులు ప్రాణాలు వదిలిన ఘటనలు అనేకం జరిగాయి. అలానే తాజాగా ఓ తల్లి కూడా ప్రమాదంలో ఉన్న తన బిడ్డను కాపాడబోయి.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన రాజులు అనే వ్యక్తికి సుందరమ్మ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 12 ఏళ్ల క్రితం రాజులు తొలి భార్య చనిపోతే.. సుందరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి గుణవర్ధన్ అనే 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కూరగాయలు తెమ్మని భర్తను సరుబుజ్జలికి పంపింది. ఆమె కూడా ఉపాధి కూలీ పనికి వెళ్లి వచ్చింది.
అనంతరం ఇంటి బయట బట్టలు ఉతుకుతుంది. ఇదే సమయంలో ఇంటి లోపల గుణ వర్ధన్ ఫ్యాన్ వేసుకోవాలని స్వీచ్ ఆన్ చేశాడు. దీంతో అతడికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో గట్టిగా అరిచాడు. బయట ఉన్న సుందరమ్మ పరుగు పరుగున లోపలికి వచ్చి.. కరెంట్ షాక్ తో కొట్టుకుంటున్న కుమారుడిని చూసి షాకైంది. వెంటనే తాను తడి చేతులతో ఉన్నాను అనే విషయం కూడా మరచి బిడ్డను తప్పించే ప్రయత్నంలో ఆమె చేయి పెట్టింది. దీంతో అతడు పక్కకి పడిపోయాడు. ఈ క్రమంలోనే సుందరమ్మకు కరెంట్ షాక్ కొట్టడంతో అలానే గొడకు తల కొట్టుకుని పడిపోయింది.
వీరిద్దరికి కేకలు విన్న సమీపంలో ఉన్న గ్రామ సచివాలయలోని వారు ఘటన స్థలానికి వచ్చారు. అక్కడ అచేతన స్థితిలో పడి ఉన్న సుందరమ్మను చూసి.. వెంటనే అంబులెన్స్ కి సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా సుందరమ్మ చనిపోయినట్లు గుర్తించారు. ఆమె మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. తన తోడుగా ఉంటుందనుకున్న భార్య.. తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో.. మృతురాలి భర్త భోరున విలపించాడు. గాయలైన గుణవర్ధన్ కి వైద్యులు చికిత్స అందించారు. ఇలా బిడ్డ ప్రాణాల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.