ఆ దంపతులు జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. అంతేకాక ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వారిని చేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న దంపతులు జీవిత చరమాంకంలో ఒంటరిగా మిగిలిపోయారు. అంతేకాక అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మరణాలు వారిని తీవ్ర వేదనకు గురిచేశాయి. బతుకు భారంగా మారడంతో.. తాము ఎవరికి భారం కాకుడదని ఆ వృద్ధ దంపతులు జీవితాన్ని ముగించారు. విధి ఆడిన వింతనాటకంలో ఈ దంపతులు ఓడిపోయి.. విగతజీవులు గా మారారు. చివరిగా చిన్న కుమారుడిని పిలిపించుకుని మనసారా మాట్లాడి.. ఆ తరువాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరి.. అసలు ఆ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన అన్నెం వెంకటేశ్వర్లు(70), సామ్రాజ్యం(65) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వెంకటేశ్వర్లు వ్యవసాయాన్నే నమ్ముకుని పిల్లలను పెంచి పెద్ద చేశాడు. అంతేకాక వారికి తన సామర్ధ్యం మేరకు కొంత ఆస్తుల్ని సమకూర్చాడు. కుమార్తె రంగమ్మను అదే గ్రామానికి చెందిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేశారు. పెద్ద కుమారుడు మస్తాన్ రావు, చిన్న కుమారుడు వెంట్రావులకు కూడా పెళ్లిళ్లు చేశారు. అయితే 2019లో పెద్ద కుమారుడి కొడుకు లీలా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మనవడి మరణాన్ని ఆ వృద్ధ దంపతులు తట్టుకోలేక పోయారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే పెద్ద కుమారుడు కిడ్నీ సమస్యతో మరణించాడు. కొడుకుకి చికిత్సపాటు కుటుంబం కోసం చేసిన అప్పుల్ని తీర్చేందుకు ఎకరన్నర పొలం అమ్మాడు. కొడుకు, మనవడి మృతితో ఆ దంపతులు మనస్తాపం చెందారు. ఇక చిన్న కుమారుడు వెంకట్రావు, అతడి భార్య అంజమ్మ పదేళ్ల క్రితమే నరసరావుపేట వెళ్లి అక్కడే నివాసముంటున్నారు. దమ్మాలపాడులోనే పెద్ద కుమారుడి ఇంటి పక్కనే ఉన్న పోర్షన్ లో వృద్ధ దంపతలు ఉంటున్నారు. పెద్ద కోడలు అనారోగ్యం కారణంగా అత్తమామలను చూసుకోలేక పోయింది. దీంతో కుమార్తె రంగమ్మ.. వెంకటేశ్వర్ల దంపతుల ఆలనపాలన చూస్తు వస్తుంది.
ఇదే సమయంలో వీరికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏమైందో ఏమో కానీ.. నరసరావుపేటలో ఉండే చిన్న కుమారుడి రమ్మని తెలిపారు. తల్లిదండ్రుల పిలుపు మేరకు వెంట్రావు దంపతులు ఆదివారం ఇంటికి వచ్చారు. ఆరోజు రాత్రి 10 గంటల వరకు చిన్న కుమారుడితో మాట్లాడుతూ వెంకటేశ్వర్ల దంపతులు గడిపారు. ఇక ఆ రాత్రి వెంకట్రావు దంపతులు ఇంట్లోకి వెళ్లి నిద్రపోయారు. ఆరుబయట పడుకున్న ఈ వృద్ధ దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం తెల్లవారు జామున ఇంటి నుంచి బయటకు వచ్చిన కోడలు.. విగత జీవులుగా పడి ఉన్న అత్తమామలను చూసి షాకయ్యారు. తమ తల్లిదండ్రులు ఇలా చేస్తారని ఊహించని కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. వృద్ధాప్యం కారణంగా బిడ్డలకు భారం కాకుడదనే ఇలా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. జీవితంలో ఎన్నో కష్టాలను భరించిన ఈ దంపతులు.. చరమాంకంలో సమస్యలకు ఎదురొడ్డి నిలబడలేకపోయారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.