ఈ మధ్యకాలంలో ఛార్జీంగ్ పెట్టిన మొబైల్, ల్యాప్ టాప్ లు పేలిపోతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలా ఎలక్ట్రానికి వస్తువులు పేలిన సమయంలో కొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఛార్జీంగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్ టాప్ పేలింది. దీంతో ఆ యువతి పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన సుమలత అనే యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తోంది. ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్న కారణంగా ల్యాప్ టాప్ కు ఛార్జీంగ్ పెట్టి.. ఆఫీస్ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ల్యాప్ టాప్ బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడే ఉన్న సుమలత ఒళ్లంతా బొబ్బలెక్కి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కడప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ల్యాప్ టాప్ బెడ్ పై ఉండటంతో బెడ్ షీట్ అంతా కాలిపోయింది. ఇంట్లో కూడా చాలా వరకు మంటలు వ్యాపించినట్లు అక్కడి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతం అమె పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అంతా కరోనా టైమ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లతో ఇంటి దగ్గరే కుస్తీ పడుతున్నారు. కంటిన్యూస్‌గా పనిచేస్తుండటంతో ఛార్జింగ్ పెట్టుకొని మరీ పని చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టి పని చేయడం ప్రమాదకరమని ఈ ఘటన వార్నింగ్ ఇస్తోంది.మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.