విజయం అందరికి ఊరికే రాదు. ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణతో సాధించుకోవాలి. చాలా కొద్దిమందికి సులువుగా సక్సెస్ అందుతుంది. వరుస ఫెయిల్యూర్ తర్వాత డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్న యువతి సక్సెస్ స్టోరీ చూద్దాం.
ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా కాంపిటిషన్ ఉంది. నోటిఫికేషన్ పడింది మొదలు లక్షల్లో అప్లికేషన్లు వచ్చి చేరుతాయి. కోచింగ్ సెంటర్లలో చాలా మంది అభ్యర్థులు చేరుతారు. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతారు. మొదటి ప్రయత్నంలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. అయినా సరే పట్టుదలతో చదివి విజయం సాధించిన వారు చాలామంది ఉన్నారు. వారిలో భూమిరెడ్డి పావని కూడా ఒకరు. ఆమె గ్రూప్-1 పరీక్షలో రెండవ ర్యాంక్ సాధించి.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని పొందింది. ఆమె గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన భూమిరెడ్డి పావని అనే యువతి గ్రూప్-1 పరీక్ష రాసి రాష్ట్ర వ్యాప్తంగా సెకెండ్ ర్యాంక్ సాధించింది. వీరిది సాధారణం వ్యవసాయ కుటుంబం. తండ్రి భూమిరెడ్డి గంగయ్య, తల్లి లక్ష్మీదేవి. చిన్నప్పటి నుండి పావని చదువుపై ఆసక్తితో ఉత్తమ ఫలితాలు సాధించేది. ప్రస్తుతం ఆమె డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉద్యోగాన్ని సాధించింది. స్కూల్ స్థాయినుండి సోషల్ స్టడీస్‌పై ఇంట్రస్ట్ ఎక్కువ. చిన్నప్పటి నుండి మానాన్నగారు ఏదైనా ప్లేస్‌కి వెళితే దానికి సంబంధించిన హిస్టారికల్ ఇష్యూస్, పొలిటికల్, జాగ్రఫికల్ ఇష్యూస్ చెప్పేవారు. అలా జనరల్ స్టడీస్‌పై ఆసక్తి పెరిగింది. 2015 నుండి గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగా.. 2016,2017లో ఎగ్జామ్స్ అటెమ్ట్ చేసినా విజయం సాధించలేకపోయింది. వరుస ఫెయిల్యూర్ అయినా సరే పోయిన ఏడాది గ్రూప్-2 ఎగ్జామ్ రాసింది. దీనిలో విజయం సాధించింది. ఈ విజయం సాధించడానికి తన కుటుంబసభ్యుల సహకారమే అని చెప్పుకొచ్చింది పావని.
హైదరాబాద్ హాస్టల్‌లో ఉండి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రిపరేషన్ కొనసాగించానని తెలిపారు పావని. సక్సస్ ఫస్ట్ అటెమ్ట్‌లో రాదు. ఆటంకాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అని చెప్పారు. సిలబస్‌ను అనాలసిస్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పట్టుదలతో చదివితే ఫలితం పొందవచ్చని ఆమె తెలిపింది. డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని పావని తెలిపింది. తమ కుమార్తె సాధించిన విజయానికి తల్లిదండ్రులు కూడా సంతోషంలో మునిగిపోయారు. రైతు కుంటుంబం నుండి వచ్చిన ఆమె సాధించిన విజయానికి గ్రామస్తులు కూడా అభినందించారు.