సంసారంలో చిన్న చిన్న గొడవలు అనేది సర్వసాధారణం. అయితే ఇవి కాస్తా పెద్దవిగా మారినప్పుడే పచ్చని సంసారం నిలువునా కాలిపోతుంది. అలా ఓ దంపతులు మధ్య జరిగిన చిన్నగొడవ ఓ మరణానికి కారణం అయింది.
భార్యాభర్తల మధ్యల గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. అలా గొడవపడని దంపతులు చాలా అరదుగా కనిపిస్తుంటారు. అయితే ఒకప్పుడు దంపతులు.. తమ మధ్య వచ్చే మనస్పర్ధలకు మరచిపోయి.. సర్ధుకుపోతూ హాయిగా జీవించేవాళ్లు. కానీ నేటితరంలో దంపతుల్లో సర్ధుకపోయే గుణం కొరవడింది. నీ కంటే నేను ఎందులో తక్కువ అనే అహం ఇద్దరిలో పెరగడంతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు అయితే తన భాగస్వామి మందలించిందని మనస్తాపంతో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యంలో ఓ ఘటన చోటుచేసుకంది. భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పార్వతీపురం మన్యం జిల్లా శృంగవరపు కోట పట్టణంలోని గొల్లవీధిలో వారాది గణేష్(28), నాగమణి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఓ క్యాంటిన్ లో పనిచేస్తున్న గణేష్ కు మద్యం తాగే అలవాటు కూడా ఉంది. అయితే అతడు మద్యం తాగి ఇంటికి వస్తుండటంతో నిత్యం ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. మద్యం తాగవద్దని నాగమణి.. గణేష్ తో వాగ్వాదం పెట్టుకునేది. ఈ క్రమంలో ఈనెల 10న మరోసారి ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం తాగవద్దని నాగమణి మరోసారి భర్తను మందలించింది. అయితే మనస్తాపం చెందిన గణేష్ గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఎస్.కోట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గణేష్ పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.