నేటికాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పరాయి సుఖానికి అలవాటు పడి కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను సైతం వదిలేసి పారిపోతున్నారు. ఇంక దారుణం ఏమిటంటే పక్కవాడితో శరీర సుఖం కోసం అడ్డువస్తున్నారని తాళికట్టిన భర్తను సైతం చంపేస్తున్నారు కొందరు భార్యలు. అయితే చివరికి వాళ్లు జైలు పాలవుతున్నారు. ఇలాంటివి నిత్యం చూస్తూ కూడా ఇంకా కొందరు అక్రమసంబంధాల వైపే చూస్తున్నారు. తాజాగా మేనమామ కూతురు కదా అని పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. కానీ పరాయి వాడితో విహేతర సంబంధం పెట్టుకున్న ఆ భార్య.. ప్రియుడి సహకారంతో భర్తను చంపేసింది. ఈఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడుకు చెందిన నల్లబోతు నరేంద్రకు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె అయిన శ్రీవిద్యతో మూడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. నరేంద్ర సెక్యురిటీ గార్డుగా పనిచేస్తుండగా శ్రీవిద్య నరసరావుపేటలోని ఓ ప్రైయివేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 19న తనను ఇంటికి తీసుకెళ్లేందుకు నరసరావుపేటకు రావాల్సిందిగా శ్రీవిద్య భర్త నరేంద్రకు ఫోన్ చేసింది. అయితే అక్కడి నరేంద్ర వెళ్లలేదు. ఆ తర్వాతి రోజు నాదెండ్ల మండలం సాతులూరు పొలిమేరలో నరేంద్ర శవమై కనిపించాడు. అయితే సూసైడ్ గా కేసు నమోదు చేసిన పోలీసులు .. దర్యాప్తు ప్రారంభించారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే నరేంద్రది సూసైడ్ కాదు. పక్క మర్డర్. అది కూడా ఎవరో కాదు స్వయంగా భార్య సహకారంతో ఆమె ప్రియుడు చంపాడు. ఒక చెప్పుతో ఈ హత్యకేసు మిస్టరీ వీడింది. నరేంద్ర చనిపోయినప్పుడు అక్కడ అతడి ఒక చెప్పు మాత్రమే ఉంది. ఇదే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. విచారణ నిమిత్తం నరేంద్ర ఇంటికి వెళ్లగా అక్కడే ఉన్న శ్రీవిద్య బావ కారులో రెండో చెప్పు దొరికింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాగా అసలు కథ బయటపడింది.పెళ్లికాక ముందు నుంచే శ్రీవిద్యకు ఆమె అక్కభర్త వీరయ్యతో అక్రమ సంబంధం ఉంది.
ఐతే అయిష్టంగానే నరేంద్రతో పెళ్లికి ఒప్పుకున్న శ్రీవిద్య.. ఆ తర్వాత కూడా వీరయ్యతో ఎఫైర్ కొనసాగించింది. తమ సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని శ్రీవిద్య, వీరయ్య భావించారు.ఈ క్రమంలో అనుకున్న పథకం ప్రకారం శ్రీవిద్య ఇంటి వస్తానని చెప్పడం జరిగింది. అదే సమయంలో వీరయ్య అటుగా తను వెళ్తున్నట్లు చెప్పి నరేంద్రను కారులో ఎక్కించుకున్నాడు. మధ్యలో మద్యం, తినుబండారాలు తీసుకొని వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఓ చోట కారు నిలిపారు.సైనెడ్ కలిపిన మద్యాన్ని నరేంద్రకు అందించారు.
దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని సాతులూరు పొలిమేరలో కాల్వ కట్టపై పడేశారు. మొత్తానికి పోలీస్ లు చెప్పు ఆధారంగా వారికీ వచ్చిన అనుమానం దిశగా విచారణ చేసి వీరయ్య, బాలరాజు, చౌడయ్య, శ్రీ విద్యను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కోర్టులో నేరం రుజువుకావడంతో నిందితులకు జీవిత ఖైదు విధించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.