కొడుకులు చూడకపోయినా.. కూతురు తమను ఆదరిస్తుందని భావించిన తల్లిదండ్రులు.. అక్కడికి వెళ్లాక తెలియడం లేదు ఆమె అసలు, సిసలు నిజ స్వరూపం. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు కొంత మంది కుమార్తెలు. దీంతో బయటకు చెప్పుకోలేక, తిరిగి కుమారుల వద్దకు వెళ్లలేక సతమౌతున్న పేరెంట్స్ ఎంతో్ మంది ఉన్నారు.
ఆస్తికోసం ఎంతటి కైనా తెగిస్తున్నారు మనుషులు. కుమారులే కాదు కూతుళ్లు సైతం హింసకు గురి చేస్తున్నారు. పిల్లలకు ఆస్తులు రాసిస్తే.. వృద్ధాప్యంలో వారిని చూడకపోతే.. అవైనా అమ్మి తిని బతకవచ్చునని ఆలోచన చేసి.. తమ కడుపున పుట్టిన బిడ్డలకు ఆస్తులు రాసివ్వడం లేదు తల్లిదండ్రులు. కొడుకులు చూడకపోయినా.. కూతురు తమను ఆదరిస్తుందని భావించిన తల్లిదండ్రులు.. అక్కడికి వెళ్లాక తెలియడం లేదు ఆమె అసలు, సిసలు నిజ స్వరూపం. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు కొంత మంది కుమార్తెలు. దీంతో బయటకు చెప్పుకోలేక, తిరిగి కుమారుల వద్దకు వెళ్లలేక సతమౌతున్న పేరెంట్స్ ఎంతో్ మంది ఉన్నారు. సమాజంలో గౌరవ ప్రతిష్టల కోసం కుమార్తె, అల్లుడు పరువు పోకూడదని నోరు నొక్కుకుంటున్న వృద్ధ జంటలెన్నో. ఆస్తి రాసివ్వాలంటూ ముసలి ప్రాణాలను వేధించుకుతింటున్నారు. రాసివ్వనని మొండి కేస్తే ఇంట్లో నుండి గెంటేయడమో లేదంటే ఇంట్లోనే నానా హింసలకు గురి చేయడమో చేస్తున్నారు. ఆస్తి రాసివ్వాలని తల్లిని వేధించిన కుమార్తె చివరకు ఏం చేసిందంటే..?
ఆస్తి రాసివ్వాలంటూ తల్లిని బెదిరించే క్రమంలో ఆత్మాహుతి చేసుకుంది కుమార్తె. ఈ ఊహించని ఘటన చూసి.. అక్కడి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడులో తల్లి ఆదిలక్ష్మి, కూతురు సుజాత ఓకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. తల్లిని సరిగ్గా చూసుకోకపోవడంతో పాటు ఆ ఆస్తి కూడా రాసివ్వాలంటూ తల్లిని హింసించడం మొదలు పెట్టింది సుజాత. దీంతో విసిగిపోయిన తల్లి కొన్ని రోజుల క్రితం పోలీసులకు, హోం మంత్రి సుచరితక ఫిర్యాదు చేసింది. ఇద్దరి మధ్య రాజీ కుదర్చిన పెద్దలు.. ఇంటి మధ్య గోడను కట్టాలని పెద్దలు సూచించారు. అయితే సుజాతకు ఇది ఇష్టం లేదు. మొత్తం ఆస్థి కాజేయాలని ఆమె ప్లాన్. గోడ కట్టే క్రమంలో వాదనకు దిగింది సుజాత. వారిని అడ్డుకునే క్రమంలో పెద్ద గొడవకు దిగింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీస్తుండగా.. ఒక్కసారిగా ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుంది. అందరూ తల్లిని, పెద్దలను బెదిరించేందుకు ఇలా చేస్తుందని అనుకున్నారు. కానీ అంతలోనే అగ్గిపుల్ల తీసుకుని, నిప్పు రాజేయడంతో.. వెంటనే శరీరానికి మంటలు అల్లుకుని, ఆమె సజీవదహనమైంది.