ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి మెుదలు పెడితే ముసలి వారి వరకు చాలా మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉన్న మనిషి ఎంతటి దారుణానికైనా వెనుకాడరు.
ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి మెుదలు పెడితే ముసలి వారి వరకు చాలా మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉన్న మనిషి ఎంతటి దారుణానికైనా వెనుకాడరు. ఈ మాటల్లో ఎలాంటి అవాస్తవం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. మద్యం మత్తులో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో వాళ్లకే తెలియదు. ఆ కోవకు చెందిన ఘటనే ఇటీవలే ఒకటి చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టాడు. ఆ దారుణమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు లో ఎంఎస్ ఎస్ కాలనికి చెందిన మునగపాటి గోపి, మౌనిక 3 ఏండ్ల క్రితమే వివాహామైంది. వీరికి ఇంతకుముందే రెండేళ్ల క్రితమే లక్ష్మీ పద్మావతి పుట్టింది. ఆ తర్వాత ఇటీవల ఆరు నెలల క్రితం మరో పాప పుట్టింది. గోపి రోజూ వారిగా కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అలాగే తనకు ఇద్దరూ బాలికలు పుట్టారంటూ గోపి తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. అంతేకాక నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. ప్రతిరోజు లాగానే సోమవారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య మౌనిక తో గొడవకు దిగాడు. చిన్నగా మొదలైన గొడవ తీవ్రంగా మారింది. ఇదే సమంయలో మద్యం మత్తులో ఉన్న గోపి.. క్షణికావేశంలో తన పెద్ద కూతురుని లక్ష్మీపద్మను పైకి ఎత్తి ఒక్కసారిగా నేలకోసి కొట్టాడు.
బండ తలకు బలంగా తగలడంతో ఆ పసి పాప అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణమైన ఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా గోపి పై దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. స్థానికుల నుంచి గోపిని రక్షించి స్టేషన్ కు తీసుకెళ్లారు. గాయపడిన పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరి.. ఇలాంటి కిరాతకపు తండ్రులకు ఏలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.