ఇటీవల కాలంలో బ్యాంక్ ల్లో దొంతనాలు, ఏటీఎంల్లో చోరీలు తెగ జరుగుతున్నాయి. దొంగలు ఆయుధాలతో బ్యాంక్ సిబ్బందిని బెదిరించి నగదు లూటీ చేస్తున్నారు. ఏటీఎం మిషన్లను JCB సాయంతో లేపి తీసుకెళ్లిన ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలోని ఓ బ్యాంక్ లు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
అనకాపల్లిలోని నర్సింగబిల్లిలో గ్రామీణ వికాస్ బ్యాంక్ లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అక్కడి సిబ్బందిని తుపాకీ తో బెదిరించి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లారు. సీసీ కెమెరాలో వారి దొంగతన దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంత మొత్తంలో నగద చోరీకి గురైందనే విషయంపై ఇంక స్పష్టత రాలేదు. ఈ దొంగతనం పై మరింత సమాచారం అందాల్సి ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.