సినిమా ప్రభావం కారణంగా ప్రేమ తర్వాత పెళ్లి.. ఆ తర్వాత లైఫ్ అంతా ఫుల్ ఖుష్ అనుకుంటారు. కానీ రియాలిటీలో మరోలా ఉంటుంది. ప్రేమ, పెళ్లి తర్వాతే.. అసలైన జీవితం మొదలవుతుంది. అప్పుడే వారిద్దరూ అర్థం చేసుకోవాల్సింది. ప్రేమను సఫలం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కుతున్న జంటలెన్నో ఆ తర్వాత జీవితాన్ని సరిదిద్దుకోవడంలో తడబడుతున్నాయి.
సినిమాలో ప్రేమలు.. పెళ్లితోనే ఎండ్ కార్డు పడుతుంది. ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ప్రేమ విఫలమైన కథలు చాలా తక్కువ. జనం ఆదరణ వాటికి తక్కువ. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. లవ్ ఫెయిల్యూర్స్‌ను ఆదరించరు కూడా. ఈ సినిమా ప్రభావం కారణంగా ప్రేమ తర్వాత పెళ్లి.. ఆ తర్వాత లైఫ్ అంతా ఫుల్ ఖుష్ అనుకుంటారు. కానీ రియాలిటీలో మరోలా ఉంటుంది. ప్రేమ, పెళ్లి తర్వాతే.. అసలైన జీవితం మొదలవుతుంది. అప్పుడే వారిద్దరూ అర్థం చేసుకోవాల్సింది. ప్రేమను సఫలం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కుతున్న జంటలెన్నో ఆ తర్వాత జీవితాన్ని సరిదిద్దుకోవడంలో తడబడుతున్నాయి. ప్రేమలో అన్ని నచ్చి.. పెళ్లి తర్వాత అభిరుచులు, ఆలోచనలు కలవక, అప్పడు తప్పు చేశామన్న ఆత్మ నూన్యత భావంతో బతుకుతుంటారు. తర్వాత గొడవలు, కోట్లాటలకు దిగి ఎంతటి విపత్కర పరిస్థితికైనా దారి తీయోచ్చు. ఇదే జరిగింది వీరి విషయంలో
ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విబేధాలు వచ్చి విడిపోయారు. కానీ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. చివరకు ఆమె ప్రాణాలను సైతం తీసేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. ఇన్వెస్టిగేషన్ అధికారి, పరవాడ డీఎస్పీ కె.వి.వి సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. అగంపూడికి చెందిన మహాలక్ష్మి, గాజువాక బీసీ సెంటర్‌కు చెందిన శ్రీనివాస్‌లు ఇద్దరికీ ఇంటర్‌లో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాదిలోనే వీరిద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని 2021లో మ్యూచువల్ డైవోర్స్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ సక్రమంగా హాజరయ్యేవాడు కాదు. దీంతో విడాకుల ప్రక్రియ ఆలస్యమైంది.
ఇంతలో మహాలక్ష్మి ఉద్యోగం చేస్తూ.. సంతోషంగా ఉంది. అది చూసిన శ్రీనివాస్ అక్కసుగా ఫీలయ్యి మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా మారి ఉన్మాదిలా మారాడు. అప్పటి నుండి మహాలక్ష్మిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయగా..కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. దీంతో మహాలక్ష్మిపై పగ పెంచుకున్నాడు. ఎలా అయినా హతమార్చాలని అనుకున్నాడు. ఇక కుట్రకు తెర తీశాడు. మంచి వాడిలా మారినట్లు నటించాడు. సోమవారం అచ్యుతాపురం లాడ్జిలో తన పేరు మీద రూం బుక్ చేసి, బిర్యానీ, మత్తు ఇంజక్షన్లు, కత్తి తీసుకుని వచ్చాడు. లాడ్జికి వెళ్లి.. భార్యకు ఫోన్ చేశాడు. రమ్మని ప్రాథేయ పడ్డాడు. మారాడని నమ్మిన ఆమె.. లాడ్జికి వెళ్లిన తర్వాత దారుణంగా హతమార్చాడు. మహాలక్ష్మి శరీరంపై 20 వరకు కత్తి గాట్లు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
అనంతరం శ్రీనివాస్ కూడా మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. రూములోకి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో వెళ్లిన సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో మహాలక్ష్మి పడి ఉండగా.. శ్రీనివాస్ అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడే చంపి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. మహాలక్ష్మి బంధువులు మంగళవారం కేజీహెచ్‌లో ఆందోళన చేశారు. మహాలక్ష్మి భర్త శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని మార్చురీ వద్ద నినాదాలు చేశారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు వారు అంగీకరించారు.