ఇతడు చదువుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం పాటు భార్యాభర్తలు బాగానే సంసారం చేశారు. కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే భార్య బాగా చదువుకోవడం, అందంగా ఉండడం, పైగా బయటకు ఉద్యోగానికి వెళ్లి వస్తుండం. ఇవన్నీ చూసి భర్త తట్టుకోలేకపోయాడు. అయితే ఇటీవల ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాగేంద్ర. వరుసకు మరదలిని 10 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో భాగంగా అత్తమామలు కట్నకానుకులు బాగానే ముట్టజెప్పారు. భార్య మాత్రం బాగా చదువుకుంది. భర్తకేమో పూర్తిగా చదువురాదు. అయితే ఈ మధ్య నాగేంద్ర భార్య ఉద్యోగంలో కూడా చేరింది. ఇక సమాజంలో వచ్చిన మార్పుల అనుగుణంగా ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో రాజ్యలక్ష్మి కూడా ఓ సెల్ ఫోన్ కొనుక్కుంది. దీంతో ఆ వివాహిత అప్పుడప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. కానీ, నాగేంద్ర చదువుకోకపోవడంతో అతనికి ఏం అర్థం అయ్యేది కాదు. భార్య చదువుకుంది కాబట్టి నన్ను ఎక్కడా నిర్లక్ష్యం చేస్తుందోనని భయపడేవాడు. ఇవన్నీ చూసిన నాగేంద్ర ఇటీవల ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడిక గ్రామంలో నాగేంద్ర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు 2013లో తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన మేనమరదలైన రాజ్యలక్ష్మి (32)ని వివాహం చేసుకున్నాడు. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఇంటి వద్దే ఉండేది. ఇక కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త చదువుకోకపోవడంతో కొన్ని రోజులు కూలీనాలీ పనులకు వెళ్తూ మిగతా రోజులు ఇంట్లోనే ఉండేవాడు. దీంతో భర్త సరిగ్గా పని చేయకపోవడంతో పూటగడవడమే కష్టంగా మారింది. ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మి తనకున్న తెలివితో స్థానికంగా ఉండే ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా చేరింది. ఇక్కడే చాలా కాలంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించింది. అయితే అవసరం నిమిత్తం ఇటీవల రాజ్యలక్ష్మి ఓ సెల్ ఫోన్ కూడా కొనుగోలు చేసింది.
రోజూ ఉద్యోగానికి వెళ్తూ వస్తూ ఉండేది. అయితే భార్య సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ తో పాటు తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడేది. భర్త నాగేంద్రకు చదువురాకపోవడంతో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం రాకపోయేది. ఇక భార్య ఉద్యోగానికి వెళ్లడం, ఫోన్ మాట్లాడుతుండడంతో భర్త జీర్ణించుకోలేకపోయాడు. చదువుకుంది కాబట్టి నన్ను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందో అని తరుచు భయపడేవాడు. ఇదే కాకుండా భార్య ఫోన్ కు వచ్చిన మెసేజ్ లలో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఇక రాను రాను భర్త రాక్షసుడిలా తయరయ్యాడు. లేనిపోని గొడవలు చేస్తూ ఉద్యోగం మానేయాలని కోరేవాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తలు తరుచు గొడవలు పడేవారు. తాను అనుకున్నట్లు నాగేంద్ర భార్యను ఉద్యోగం మానిపించేశాడు.
భర్త అనుమానంతో విసిగిపోయిన భార్య ఇటీవల తన పుట్టింటికి వెళ్లింది. దీంతో రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు సర్దిచెప్పి భర్త ఇంటికి పంపించేశారు. ఇక కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఇకపోతే శుక్రవారం రాత్రి రాజ్యలక్ష్మి ఫోన్ మాట్లాడింది. దీంతో భార్యపై భర్తకు అనుమానం మరింత పెరిగింది. ఇదే విషయంపై భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన భర్త నాగేంద్ర.. ఇంట్లో ఉన్న కత్తిపీట చెక్కతో భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం భర్త భయపడి అదే రాత్రి స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజ్యలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనుమానంతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి చేజేతులా సంసారాన్ని నాశనం చేసుకున్న నాగేంద్ర కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.