టమాటా లేనిదే వంట చేయడం కష్టమౌతుంది మహిళలకు. కానీ కొన్ని రోజుల నుండి టమాటా ధరలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకూ టమాటా రేట్లు పెరుగుతూ జిహ్వ చాపల్యానికి పరీక్ష పెడుతున్నాయి.
ఇంట్లో కూర ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా, రసం చేసుకోవాలన్నా, పచ్చడితో ఓ ముద్ద తినాలనుకున్నా ముందు మనకు గుర్తుకు వచ్చే కూరగాయ టమాటా. టమాటా లేనిదే వంట చేయడం కష్టమౌతుంది మహిళలకు. కానీ కొన్ని రోజుల నుండి టమాటా ధరలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకూ టమాటా రేట్లు పెరుగుతూ జిహ్వ చాపల్యానికి పరీక్ష పెడుతున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో వీటి ధర రూ. 120 నుండి రూ. 200 వరకు పలుకుతోంది. సుమారు నెల రోజుల పాటు ఈ ధరలు ఇలాగే కొనసాగవచ్చునని చెబుతున్నారు కొంత మంది వ్యవసాయ నిపుణులు. అయితే సందట్లో సడేమియా లాగా, టమాటా ధర పెరుగుదలపై సోషల్ మీడియాను మీమ్స్, ఫన్నీ వీడియోలతో నింపేస్తున్నారు ఇన్ల్పుయన్సర్లు.
రెండు టమాటాలు తనకు చెప్పకుండా కోసాడన్న ఒకే ఒక్క కారణంతో భర్తను వదిలిసిన ఈ రోజుల్లో .. ఓ తండ్రి తన కుమార్తె కోసం పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటారా.. తన కుమార్తెకు తులాభారాన్ని నిర్వహించారు. అదీ కూడా బంగారం, వెండి, పైసలు, బెల్లంతో కాదూ టమాటాలతో. ఇంతకు ఈ ఘటన ఎక్కడో జరిగిందనుకుంటున్నారేమో కానే కాదూ.. మన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో. జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో నగరానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహినీ దంపతుల కుమార్తె భవిష్యకు బంగారంతో(బెల్లంతో) మొక్కు చెల్లించుకోనేందుకు తులాభారం నిర్వహించారు. ఇప్పుడు టమాటాలను బంగారంతో సమానంగా చూస్తున్నారేమో.. ఆయన కూడా తన కుమార్తె తులాభారాన్ని టమాటాలతో నిర్వహించారు.
సుమారు 51 కిలోల టమాటాలు వినియోగించారని సమాచారం. ముందుగా టమాటాలతో కుమార్తె తులాభారాన్ని కొలిచి, ఆ తర్వాత బెల్లం, పంచదార వంటి పదార్ధాలతో నిర్వహించారు. వాటిని దేవస్థానానికి అప్పగించింది అప్పారావు ఫ్యామిలీ. అమ్మవారి నిత్యాన్నదానంలో వీటిని ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ఈ తులాభారాన్ని గుడి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ వార్త అంతటా హల్చల్ చేస్తుంది. టమాటా కోసం మినీ సైజ్ యుద్ధమే జరుగుతుంది. అలాంటిది టమాటాలతో తులాభారం వేశావంటే ఏం గుండెరా అది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తులాభారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.