సాధారణంగా దొంగలు ఇళ్లల్లో, బ్యాంకుల్లో మొదలైన ప్రాంతాల్లో చోరీలకు పాల్పతుంటారు. అయితే కోర్టుల్లో దొంగలు పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయి. నెల్లూరు జిల్లాలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఓ కోర్టులో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కోర్టులో సీజ్ చేసిన నాలుగు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను, కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కొన్ని డాక్యుమెంట్లును కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఆ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా పోలీసులు గుర్తించారు. మరికొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి విదేశాల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని 2017లో కాకాణి ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి.. నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కోర్టులోకి చొరబడిన దొంగలు.. కోర్టులో భద్రపరిచిన ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్ లతో పాటు కొన్ని పత్రాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు ప్రాంగణంలో పడేసిన పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన కోర్టు ఆవరణంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో.. సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.