సాధారణంగా దొంగలు ఇళ్లల్లో, బ్యాంకుల్లో మొదలైన ప్రాంతాల్లో చోరీలకు పాల్పతుంటారు. అయితే కోర్టుల్లో దొంగలు పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయి. నెల్లూరు జిల్లాలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఓ కోర్టులో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కోర్టులో సీజ్ చేసిన నాలుగు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను, కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కొన్ని డాక్యుమెంట్లును కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఆ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంత్రి […]