వీధి కక్కల దాడిలో హైదరాబాద్ అంబర్ పేట్ లో ఓ ఐదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా పిచ్చి కుక్క దాడిలో ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ కుక్క నుంచి అతడిని రక్షించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే వీధి కక్కల దాడిలో హైదరాబాద్ అంబర్ పేట్ లో ఓ ఐదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. ఇక ఈ ఘటన మరువకముందే ఇటీవల కుక్కల దాడిలో మరో 5 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి చివరికి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వీధి కుక్కలు పిల్లలనే కాకుండా పెద్దవాళ్లను కూడా వదలడం లేదు. తాజాగా ఓ పిచ్చి కుక్క దాడిలో ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ కుక్క నుంచి అతడిని రక్షించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
అది ఏపీలోని కడప జిల్లా రాజంపేట అర్బన్ పరిధిలోని వైఎస్సార్ నగర్. ఇక్కడే చౌడయ్య అనే వ్యక్తి నివాసం ఉంటూ స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం టీ తాగడానికి వచ్చిన గౌడయ్యపై ఓ పిచ్చి కుక్క తీవ్రంగా దాడి చేసింది. వెంటనే స్పందించిన స్థానికులు.. ఆ కుక్కను చేదరగొట్టి చౌడయ్యను రక్షించారు. ఇక హుటాహుటిన అతడి కుటుంబ సభ్యులు చౌడయ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు కుక్కల బెడదపై ఫోకస్ పెట్టారు. వీధి కుక్కల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయందోళనలకు గురువుతన్నారు. కుక్కల దాడిలో గాయపడిన ఉపాధ్యాయుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.