SP Pakkirappa: పదిహేను సంవత్సరాల క్రితం రాయలసీమలో ఫ్యాక్షనిజం పీక్ స్టేజ్‌లో ఉండేది. చంపుకోవటం, నరుక్కోవటం సాధారణంగా జరిగేది. కొంతమంది పొద్దున లేస్తే ప్రత్యర్థిని మట్టుబెట్టే పనిలో నిమగ్నమయిపోయేవారు. ఈ నేపథ్యంలోనే ఊర్లకు ఊర్లు నాశనం అయ్యాయి. కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ, ఆ తర్వాతి రోజుల్లో పరిస్థితులు మరాయి. ఫ్యాక్షన్‌కు ఊతమిచ్చిన నిరాక్ష్యరాస్యత తగ్గుతూ వచ్చింది. ప్రజల్లో కూడా చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. ఫ్యాక్షనిజం నశించింది. కానీ, మనుషులు, ఊర్ల మధ్య దూరం అలానే మిగిలిపోయింది.
అప్పుడప్పుడు గొడవల రూపంలో పగల తాలూకూ కోపాలు బయటపడుతూ ఉన్నాయి. అలాంటి ఓ గ్రామంలో పోలీసుల కారణంగా జనం ఒక్కటయ్యారు. గణపతి నిమజ్జనం రోజున సరదాగా అందరూ కలిసి చిందులేసి సంతోషించారు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా, తాడిపత్రి రూరల్ మండలం బోడాయిపల్లి గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా జనం మధ్య దూరం పెరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంది.
ఈ నేపథ్యలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రామస్తుల్ని కలపాలని జిల్లా ఎస్పీ భావించారు. అనుకున్నదే తడవుగా ఊర్లోకి వెళ్లారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు. గ్రామస్తుల్ని ఏకం చేసి, వారితో పాటు డ్యాన్స్ చేశారు. రంగుల మధ్య జనం కేరింతలతో ఆ ప్రాంతం మొత్తం మార్మొగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు పోలీసుల ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.