ఒకప్పుడు రాత్రిపూటే దొంగతనాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు పగటి పూట కూడా యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగ చైన్ స్నాచర్లు మాత్రం రెచ్చిపోతున్నారు.
దొంగల బెడద తప్పడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చోరీలు ఆగడం లేదు. రోజూ దేశంలోని ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు కేవలం రాత్రిపూటే దొంగతనాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఉదయం పూట, అందరూ చూస్తుండగానే కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి వారికి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నా పెద్దగా మార్పు రావడం లేదు. కష్టపడే తత్వం లేకపోవడం, ఈజీ మనీకి అలవాటు పడటం, డబ్బుపై వ్యామోహం లాంటివి దొంగతనానికి కారణాలు అని నిపుణులు అంటున్నారు. ఇకపోతే, ఈమధ్య దొంగతనాలు ఎక్కువైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చోరీలు అధికంగా జరుగుతున్నాయి.
ముఖ్యంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మరో చైన్ స్నాచింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో చోటుచేసుకుంది. నగరంలోని 5వ రోడ్డులో మారెక్క అనే మహిళ గురువారం ఉదయం ఇంటి ముందు చీపురుతో ఊడుస్తోంది. ఇదే టైమ్లో అటువైపుగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్పై వచ్చి ఆగారు. అందులోని ఒక వ్యక్తి చుట్టుపక్కల ఎవ్వరూ లేనిది చూశాడు. ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించి మారెక్క మెడలోని గొలుసును లాగేశాడు. పారిపోవడానికి రెడీగా ఉన్న బైక్ ఎక్కి జంప్ అయ్యాడు. దీంతో దిగ్బ్రాంతికి గురైన మారెక్క.. రెండు తులాల గొలుసు పోయిందని లబోదిబోమంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
దొంగతనం ఇలా కూడా చేస్తున్నారా?… pic.twitter.com/kzWGBBOfnZ
— venky bandaru (@venkybandaru13) April 20, 2023