Nellore: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లెక్చరర్‌కు ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో వారు ఈ పనిచేశారు. సరైన వైద్యం అందక చివరకు లెక్చరర్ కన్నుమూశాడు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రామకృష్ణ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు రామకృష్ణకు వైద్యం చేయటం మొదలుపెట్టారు. అతడికి కుట్లు వేసి కట్లు కట్టారు. అనంతరం ఇంజెక్షన్ కూడా వేశారు.
రామకృష్ణ బ్రతికితే చాలనుకున్న కుటుంబసభ్యులు దీన్నంతా చూస్తు ఊరుకున్నారు. ఆలస్యంగా డ్యూటీకి వచ్చిన డ్యూటీ డాక్టర్ రామకృష్ణకు వైద్యం చేయటంలో అలసత్వం వహించాడు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, నెల్లూరు తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రామకృష్ణ కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్ల వైద్యం కారణంగానే రామకృష్ణ చనిపోయాడంటూ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Acham Naidu: నాకు ప్రాణహాని ఉంది.. భద్రత పెంచండి: డీజీపీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.