Nellore: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లెక్చరర్‌కు ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో వారు ఈ పనిచేశారు. సరైన వైద్యం అందక చివరకు లెక్చరర్ కన్నుమూశాడు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రామకృష్ణ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ […]