తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి నోటీఫికేషన్ నవంబర్ 16న విడుదల కానుండగా ఈ నెల 23 వరకు నామినేషన్ లు స్వీకరించనున్నారు. అయితే తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అనంతపురం 1, కృష్ణా 2, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, విజయనగరం 1, విశాఖపట్నం 2, చిత్తూరు 1, ప్రకాశం 1 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక తాజాగా వెలువడిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ఈసీ తెలిపింది.