ప్రభుత్వాలు రైతులను ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నామని చెబుతున్నా కొన్ని చోట్ల రైతులు అప్పుల బాధలు వేగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వారిని అప్పుల ఊబిలో నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రైతులు ఆత్మహత్యలకు పాల్పపడుతూనే ఉన్నారు.
రాష్ట్రంలో అనేక జిల్లాలో అప్పుల భారంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు వైసీపీ ఎన్నో వాగ్ధానాలు చేసిందని.. అందులో రైతులకు రూ.50వేల పంట పెట్టుబడి హామీ ఇచ్చిందని.. అది ఏమైందని పవన్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలకు పంట పెట్టుబడి అందించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల అవసరాలు, కష్టాలు చూసి ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్లు అడ్డగోలుగా అప్పులు ఇస్తూ.. సమయానికి కట్టకుంటే పవరు తీస్తున్నారు. దీంతో ఎంతోమంది మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ముందు రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దని.. ప్రభుత్వం ఇచ్చిన హామీ గురించి నిలదీయాలని సూచించారు.
జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. గత 3 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ప్రభుత్వం ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తాను కౌలు రైతులకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామని చెప్పారు.
అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/8XJmNZlovn
— JanaSena Party (@JanaSenaParty) April 19, 2022