సాధారణంగా చాలా మందికి కారు కొన్నాలనే కల ఉంటుంది. ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిస్తాయి. అలాంటి ఘటనే రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది.
ప్రతి మనిషికి అనేకమైన కోరికలు ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మందికి సొంత ఇళ్లు, ఓ కారు ఉండాలనే కోరిక ఉంటుంది. అలా తమ కొర్కేలు తీర్చుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి డబ్బులు సమాకూర్చుకుంటారు. అలా తమ కలను నిజం చేసుకునే సమయంలో జరిగే చిన్న చిన్న పొరపాటులు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవలే ఓ వ్యక్తి కొత్తకారును కొనుగోలు చేశాడు. అయితే దానిని షో రూమ్ నుంచి బయటకు తెచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. దీంతో కొత్త కారు కాస్తా బాగా దెబ్బతిని రోడ్డుపై నిట్టారుగా పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివిధ మార్గాల్లో అందిన సమాచారం ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి డీలర్ షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఓ ఫోక్స్ వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. కారు డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. దాదాపు కాస్తా ఎత్తులో నుంచి కారు రోడ్డుపై నిట్ట నిలువుగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. స్థానికులు క్రైన్ సాయంతో ఆ కారును పక్కకు తీశారు. ఈ క్రమంలో చాలా మంది జనాలు అక్కడ గుమ్మిగూడారు. కస్టమర్ తొందర పాటు, అత్యుత్సాహం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండానే కారు నడిపితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇక ఫోక్స్ వ్యాగన్ కారు గురించి మాట్లాడితే.. ఇది చాల ప్రత్యేకమైనది. భారతీయ మార్కెట్ లో ఫోక్స్ వ్యాగన్ వర్టస్ రూ.11 లక్షలకు పైగా ప్రారంభ ధర ఉంటుంది. ఈ మోడల్ కారు మార్కెట్ లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్. రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ మోడల్ కారు ప్రత్యేకల గురించి చూసినట్లైయితే.. 1 లీటర్ టీఎస్ఐ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్ పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలానే 1.5 లీటర్ టీఎస్ఐ ఫోర్ సిలిండర్ టర్పో పెట్రోల్ ఇంజిన్ 150 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఎన్సీఏపీ క్రాస్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొంది.. దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. ప్రస్తుతం కారు బోల్తా పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.