టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 87వ రోజుకి చేరుకుంది. 87వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని లోని గాజుల దిన్నె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 87వ రోజుకి చేరుకుంది. 87వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గాజులదిన్నె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా విడిది కేంద్రంలో 1000 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. 87వ రోజు ఎమ్మిగనూరు నియోజవర్గంలోని గాజుల దిన్నె నుంచి యాత్ర ప్రారంభమైంది.
గాజుల దిన్నెలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న మునగతోటను నారా లోకేశ్ పరిశీలించారు. మత్సకారులు లోకేశ్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. వారి సమస్యలపై లోకేశ్ స్పందిస్తూ టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కారిస్తామంటూ హామి ఇచ్చారు. పాదయాత్రలో గాజులదిన్నె ప్రాజెక్ట్ ముంపు రైతులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలానే కౌరవాడి గ్రామంలో ఉల్లి రైతులు యువనేత లోకేశ్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లిరైతులను ఆదుకుంటామని, ప్రతి పంటకు కనీస మద్దతు ధర అందిస్తాంమని లోకేశ్ అన్నారు.
అలానే రైతుల నుండి ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. అలానే గోనెగండ్ల, సి. బెళగల్, వేముగోడు గ్రామస్తులు లోకేశ్ ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంత ప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లు అందించలేకపోతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. 87వ రోజులో ఎమ్మిగనూరులో సాగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.