నారా లోకేశ్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ అల్లుడు అని కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఓ యువ రాజకీయ నేతగా ఎదుగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడు పెంచిన లోకేశ్ తనకంటూ అభిమానులను, ఫాలోవర్లను పెంపొందించుకున్నారు. నువ్వేం నేత అని హేళన చేసిన వారి చేతే మన్ననలు పొందే స్థాయికి ఎదిగారు.
ఒక రాజకీయ నేతగానే కాకుండా అటు కుమారుడిగా, భర్తగా, తండ్రిగా కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉంటూ ఉంటారు. ఈ రోజు(ఆగస్టు 26)న నారా లోకేశ్- బ్రాహ్మణికి ఎంతో ప్రత్యేక రోజు కావడంతో లోకేశ్ భార్యను ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. వారి వివాహం జరిగి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. భార్య, కుమారుడితో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగ భరిత సందేశాన్ని పొందు పరిచారు.
“ 15 ఏళ్ల దాంపత్య జీవితం.. 15 ఏళ్ల అపురూపమైన ప్రేమ.. 15 ఏళ్లుగా ఒకరి కోసం ఒకరు నిలిచిన తీరు.. ఈ 15 ఏళ్లు 50 ఏళ్లుగా మారినా గానీ.. నీపై నాకున్న ప్రేమలో ఎలాంటి మార్పు రాదు.. వార్షికోత్సవ శుభాకాంక్షలు” అంటూ నారా లోకేశ్ భార్యకు ఎంతో ఎమోషనల్‌గా యానివర్సరీ విషెస్ చెప్పారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు అన్నా- వదినకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. కామెంట్స్ రూపంలో మీరు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయండి.