ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. ఏపి కెబినెట్ లో కొత్తగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని సార్లు ఆలయాల్లో సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు వచ్చినపుడు ఆలయ సిబ్బంది అతిగా ప్రవర్తిస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాల హస్తి దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ సిబ్బంది అతిగా ప్రవర్తించారు.. దాంతో అక్కడికి వచ్చిన భక్తులకు ఓపిక నశించి మంత్రిపై విమర్శలు చేసి నానా రబస చేశారు. మంత్రికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. మంత్రి గో బ్యాక్ అంటూ నినదించారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల వరుస సెలవులు రావడంతో కుటుంబంతో పలు పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి దర్శనానికి దాదాపు నాలుగు ఐదు గంటల సమయం పడుతుంది. దీంతో ఓపికగా క్యూలైన్లలోనే ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మంత్రి హోదాలో కొట్టు సత్యనారాయణ అక్కడికి వచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. మంత్రికి పూలదండ వేసి స్వాగతం పలుకుతూ పెద్ద హంగామా క్రియేట్ చేశారు.
అప్పటికే క్యూలైన్లో గంటలతరబడి నిలబడి సొమ్మసిల్లి పడిపోతున్నా భక్తులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో భక్తుల ఆగ్రహాన్ని గమనించిన మంత్రి కొట్టు సత్యనారాయణ స్వయంగా భక్తుల వద్దకు వెళ్లి సర్ధి చెప్పారు.. అంతే కాదు క్యూ లైన్ లో నిల్చున్న వారికి వెంటనే స్వామి వారి దర్శనం ఏర్పాటు చేయాలని ఆలయ సిబ్బందికి తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.