ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు బిజీ బీజీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఎన్నో రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వం పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రాలకు శ్రీకారం చుట్టిందని.. రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ఏర్పడి ఇన్నేళ్లు అయినా రాజధాని లేదని.. అభివృద్ది కుంటుపడిందని, రాష్ట్రాలన్ని అప్పులపాలు చేశారని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పలు కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఏపీలో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు మంత్రులు, ఏమ్మెల్యేలు. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న విడుదల రజినీ నేడు విశాఖలో ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి రజినితో పాటు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, పలువరు అధికారులు విచ్చేశారు. వీరంతా లిఫ్ట్ ఎక్కారు.. ఒక్కసారే లిఫ్ట్ అగిపోయింది. దీంతో కార్యకర్తలు, అధికారులు ఒక్కసారే ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది ఎమర్జెన్సీ కీతో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశారు.
మంత్రి, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న లిఫ్ల్ ఆగిపోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే లిఫ్ట్ లో కెపాసిటీకి మించి ఎఉక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ ఆగిపోయిందని సిబ్బంది తెలిపారు. మొత్తానికి అందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలు ఇలాగే లిఫ్ట్ లో చిక్కుకుపోయిన సంఘటనలు ఎన్నో జరిగాయి. కొన్ని సాంకేతిక కారణాలు అయితే.. ఎక్కువగా కెపాసిటికి మించి లిఫ్ట్ లో ఎక్కడం వల్లనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.