ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం నెలకొంది. జయరాం తమ్ముడు నారాయణ స్వామి భార్య ఆకస్మికంగా మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం నెలకొంది. రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి జయరాం తమ్ముడు నారాయణ స్వామి భార్య ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గమ్మనూరు త్రివేణీని బెంగళూరులోని ఓ ఆసుప్రతిలో చేర్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె పార్థీవ దేహాన్ని మధ్యాహ్నం ఆలూరులోని నివాసానికి తీసుకు రానున్నారు.
ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని మధ్యాహ్నాం నుండి ఆలూరులోని నివాసంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆలూరులోని స్వగృహానికి మంత్రి గుమ్మనూరు జయరాం వెళ్లనున్నారు. ఏపీ మంత్రి జయరాం సోదరుడు నారాయణస్వామి సతీమణి త్రివేణి మరణంపై వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.