అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ పూజారి కొండపై దేవునికి పూజలు చేస్తూ కాలు జారీ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో శింగనమలలో గుంపమల్లయ్య స్వామి పూజలు జరుగుతున్నాయి. దీంతో ఆలయ పూజారి పాపయ్య కొండపై ఉన్న గుంపమల్లయ్య స్వామికి పూజలు చేయటం మొదలు పెట్టారు. దీంతో పూజారి పాపయ్య ప్రమాదవశాత్తు కాలు జారి 100 అడుగుల రాళ్ల గుట్టపై నుంచి కిందకు పడ్డాడు.
దీంతో వెంటనే వెళ్లి చూసే సరికి పూజారి అక్కడిక్కడే చనిపోయాడు. 100 మీటర్ల భారీ ఎత్తున నుంచి పడటంతో పాపయ్య ప్రాణాలు విడిచాడు. ఇక అతి దారుణంగా పడిపోయిన పూజారి పాపయ్య మరణంపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనను అక్కడున్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.