జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్ , నటనతో అందరి మదిలో పవర్ స్టార్ గా నిలిచారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ పవన్ కళ్యాణ్ రీయల్ హీరో అనిపిస్తున్నాడు. అయితే ఈ పవర్ స్టార్ ను కలిసేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఎదురు చూస్తోంది.
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్ , నటనతో అందరి మదిలో పవర్ స్టార్ గా నిలిచారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ పవన్ కళ్యాణ్ రీయల్ హీరో అనిపిస్తున్నాడు. ఇలా పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పిన చాలా తక్కువే. పవన్ ని ఆయన అభిమానులు.. తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. అందుకే చాలా మంది ఆయనను కలవాలని ఉందంటూ తమ కోరికను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కూడా అదే కోరిక కోరుకుంది. మరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం చంద్రయ్యగారి పల్లికి చెందిన అనూషకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆమె ఆయన సినిమాలంటే ఎంతో ఆసక్తిగా చూస్తుంది. అలానే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, పేదలను ఆదుకోవడం అనూషాను ఎంతగానే ఆకట్టుకుంది. ఆమె ఎప్పటి నుంచో తన అభిమాన హీరోను కలవాలని కోరుకునేది. ఈక్రమంలోనే మూడేళ్ల క్రితం అనారోగ్యం పాలైంది. అలానే మూడేళ్లగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నప్పటికి పవన్ ని కలవాలనే కోరిక మాత్రం ఆమెలో తగ్గలేదు.
తన జీవితంలో ఒక్కసారైనా పవన్ ను చూడాలని అనూష ఆకాంక్షిస్తోంది. కుమార్తె పరిస్థితి చూసిన అనూష తల్లి తీవ్ర వేదనకు గురవుతున్నారు. తన కుమార్తె మూడేళ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతుందని, పవన్ కళ్యాణ్ ను చూడాలని తపిస్తోందని, అవకాశం కల్పించమని అనూష తల్లి వేడుకుంటుంది. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరోపక్క రాజకీయా బిజీ షెడ్యూల్ లో అనూష కోరికను మన్నించి పవన్ కళ్యాణ్ కలుస్తారో లేదో చూడాలి మరి. జనసేన పార్టీని స్థాపనతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇంత బిజీ సమయంలో కూడా తన అభిమానుల కష్టాలను తీరుస్తూ.. గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. గతంలో గుంటూరు జిల్లా ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చినపుడు.. ఆ బాధిత కుటుంబాలకు ..ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలానే తనను కలవాలని కోరుకున్న చాలా మంది అభిమానులను సైతం పవన్ కల్యాణ్ కలిశారు. అలానే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇలా నిత్యం అభిమానుల కోసం, స్నేహితుల కోసం పవన్ కల్యాణ్ ముందుంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి.. పవన్ కల్యాణ్ ని కలవానే ఆ యువతి కోరిక తీరుతుందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.