ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. కుల, మత, జాతి, రంగు తేడాలు ప్రేమకు ఉండవు. అయితే ఈ ప్రేమల్లో కొన్ని మూడ్నాల ముచ్చటగా మారిపోతున్నాయి. చిన్నపాటి మనస్పర్ధలు లేక తాను ప్రేమిస్తున్న వ్యక్తిపై తొలగిన ఆకర్షణ కారణంగా కొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతుంటాయి. అలానే పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు విడిపోతుంటారు. కొందరు మాత్రమే తమ ప్రేమను గెలిపించుకునేందుకు కృషి చేస్తారు. అలా అని పెద్దలతో గొడవలకు దిగటంలేదు. పెద్దలను ఒప్పించే వరకు నిరీక్షించి.. చివరకు విజయం సాధిస్తారు. అచ్చం అలానే 12 ఏళ్లపైగా ఉన్న ఓ ప్రేమ జంట నిరీక్షణ ఫలించింది. పెద్దలు పెట్టిన పరీక్షలు ఈ ప్రేమ జంట గెలిచి..పెళ్లి పీటలు ఎక్కింది. మరి.. అసలు ఈ 12 ఏళ్ల ప్రేమ కథా చిత్రం ఎందో ఇప్పుదు చూద్దాం..
విశాఖాకు చెందిన సూర్య ప్రకాశరావు, సీతామహలక్ష్మి దంపతుల మూడో కుమారుడు భవానీ ప్రసాద్ దాదాపు 13 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఐక్ వేది అనే మలేషియాకు చెందిన అమ్మాయితో భవానీ ప్రసాద్ కు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. వీరి పెళ్లి భవానీ ప్రసాద్ కుటుంబం అంగీకరించింది, కానీ ఐక్ వేది కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. అతడిని తప్ప తాను ఎవర్ని పెళ్లి చేసుకోనని ఆ యువతి తెగేసి చెప్పింది. భవానీ ప్రసాద్ కూడా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే తప్ప మరొకరిని చేసుకోనని స్పష్టం చేశాడు.
అలా 13 ఏళ్ల క్రితం వారిద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. పెళ్లి పీటలు ఎక్కేందుకు పెద్దల అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇద్దరూ ఎం.ఎస్, పీహెచ్ డీలు చేసి.. సిడ్నీలో ప్రొఫెసర్ గా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అయినా కూడా ఐక్ వే కుటుంబ సభ్యుల మనసు మారలేదు. భవానీ ప్రసాద్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ఐక్ వే కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రసాద్ సంస్థలో చేరి.. వ్యాపారంలో తోడుగా ఉంది. ఆ విధంగా ఇద్దరు బిజినెస్ చేసుకుంటునే పెద్దల అనుమతి కోసం దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురు చూశారు. ప్రస్తుతం వారిద్దరి వయ్ససు 41 వచ్చాయి. వీరి ప్రేమలో నిజాయతీ నచ్చిన ఐక్ వే కుటుంబ సభ్యులు.. పెళ్లికి ఆమోదం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రుల నడుమ శుక్రవారం వీరి వివాహం జరిగింది. మరి.. ఈ 12 ఏళ్ల ప్రేమ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.