భార్య లాంగ్ చైన్ మింగేసిన భర్త.. చైన్ మింగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు సైతం బిత్తరపోయారు. అసలేం జరిగిందంటే?
ఏపీలోని ధర్మవరంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య లాంగ్ చైన్ ను మింగేశాడు. అది ఏకంగా మూడు నెలలుగా కడుపులోనే ఉండడం విశేషం. అయితే, అతనికి కడుపులో కాస్త ఇబ్బందిగా ఉండడం, మాటలు సరిగ్గా రాకపోవడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కానింగ్ తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాజేంద్రనగర్ లో ఆంజనేయులు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కడుపులో ఏదో ఉన్నట్టు అనిపించింది. రాను రాను అతని నోటి మాట కూడా రాలేదు. దీంతో ఏం జరిగిందని అతని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు స్కానింగ్ తీయాలని చెప్పారు. వారు కోరినట్లే స్కానింగ్ కూడా తీయించారు. ఆ రిపోర్ట్ లో చూడగా.. అతని కడుపులో చైన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఇది చూసిన వైద్యులు, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆపరేషన్ ద్వారా ఆ చైన్ బయటకు తీయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు. ఆంజనేయులుది మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. ఇక ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అన్ని రిపోర్టులను పరిశీలించిన వైద్యులు.. ఎలాంటి సర్జరీ లేకుండా కడుపులో ఉన్న చైన్ తీయాలని అనుకున్నారు. వాళ్లు అనుకున్నట్లుగానే వైద్యులు ఇటీవల ఎలాంటి కుట్లు లేకుండా చాలా జాగ్రత్తగా ఆంజనేయులు కడుపులో ఉన్న లాంగ్ చైన్ ను బయటకు తీశారు.
దానిని చూసి వైద్యులు, బాధితుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ చైన్ బయటకు తీయడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆ చైన్ అతని కడుపులో ఏకంగా మూడు నెలల పాటు అలాగే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే అతడిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.