గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఆ వర్షాల నుంచి రైతులు కోలుకోక ముందే.. మరో భారీ వర్షం రానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఇటీవల కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వానలు కూడా కురిశాయి. వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ వంటి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దెబ్బకు రైతులు తీవ్రం నష్టపోయారు. వరి, శనగ, మిరప వంటి పంటలు నీటిపాలయ్యాయి. ఈ వర్షాలు మిల్చిన నష్టాల నుంచి రైతులు తేరుకోక ముందే తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖలు తెలిపాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అక్కడక్కడ వడగళ్ల వాన కురువొచ్చని కూడా హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలా బాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
అలానే అటు ఏపీలో కూడా అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. రాయసీమలో కర్నూలు, నంద్యాల జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షలు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్ర నష్టపోయిన రైతులకు, వాతావరణశాఖ చేసిన తాజా హెచ్చరిక షాకి గురి చేసింది.