రాజకీయ నాయకులు అంటే నిత్యం చుట్టూ వందలాది మంది జనాలు, కార్యకర్తలు, గన్‌మ్యాన్‌లతో ఎంతో దర్పంగా ఉంటారు. రాజకీయాల్లో రాణించిన వారేవరైనా సరే.. మరణించే వరకు అదే జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. నిత్యం లైమ్‌లైట్‌లో ఉండాలని ఆశిస్తారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. ఓ స్టేజ్ దాటాక.. అన్నింటిని వదిలేసి.. పూర్తిగా ఆధ్యాత్మికవైపు మరలి సాధారణ జీవితం గడపాలని కోరుకుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మాజీ మంత్రి రఘువీరారెడ్డి. తెలుగు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Zomato డెలివరీ బాయ్‌ను ఆదుకున్న నెటిజన్లు.. గంటల వ్యవధిలో బైక్ కొనిచ్చారు!
అలాంటి రఘువీరారెడ్డి.. కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుని.. సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటి ఆయన రూపానికి.. రాజకీయనేతగా ఉన్నప్పటి రూపానికి ఏమాత్రం పోలిక లేదు. రాజకీయ నేతగా ఉన్నప్పుడు ఇస్త్రీ నలగని ఖద్దరు బట్టల్లో ఎంతో హుందాగా కనిపించిన రఘువీరారెడ్డి.. ఇప్పుడు తెల్లని ముతక పంచె, నెరిసిన గడ్డంతో.. ఓ సామాన్య వ్యక్తిలా దర్శనమిస్తున్నారు. గబుక్కున చూసిన వారు ఆయనను పోల్చుకోవడం, వెంటనే గుర్తుపట్టడం చాలా కష్టం. ప్రస్తుతం సొంతూరికే పరిమితైన రఘువీరారెడ్డి.. వ్యవసాయం చేసుకుంటూ.. కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు.
ఇది కూడా చదవండి: స్తంబానికి కట్టేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి.. ఫోటో వైరల్
ఈ క్రమంలో సత్యసాయి జిల్లా, నీలకంఠపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో 2022 శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపులో మాజీ మంత్రి రఘువీరా స్థానిక గ్రామస్థులతో పాటు డ్రమ్ములు మోగిస్తూ, చిందులేస్తూ భక్తిపారవశ్యంతో భక్తులను హుషారెత్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రఘువీరారెడ్డిని ఇలా చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రశాంత జీవితం గడుపుతన్న తమ ప్రియతమ నేతను అభినందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.