ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్నదాన భవనంలో మరోసారి వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీశైలం అన్నదాన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరోసారి వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. పేలుడుతో ఒక్కసారిగా భారీ శబ్ధం వచ్చింది. దీంతో అక్కడే ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు బయటి వైపు సంభవించటంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఉద్యోగుల ప్రాణాలు పోయేవి. అయినప్పటికి ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వారికి అక్కడ చికిత్స అందుతోంది. వేడి ఎక్కువ కావటంతో బాయిలర్ పేలినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. గత నవంబర్‌లోనూ శ్రీశైలం దేశస్థానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్నదాన భవనంలో ఓ బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.
కాగా, నెల్లూరు జిల్లా కలెకర్ట్ కార్యాలయంలోనూ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండో శనివారం కావటంతో సిబ్బంది విధుల్లో లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాదం కారణంగా కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచిన ఎన్నికల సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో ఫైళ్లు కూడా కాలిపోయి ఉండొచ్చని సమాచారం. మరి, ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.