టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకి చేరుకుంది. 100వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 98వ రోజుకి చేరుకుంది. 98వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనానికి 20 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఓ బస్సు బోల్తా పడింది.
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్నదాన భవనంలో మరోసారి వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ అన్నదాన భవన సముదాయంలో పెద్ద ప్రమాదం తప్పింది. మల్లికార్జున స్వామి దేవాలయంలో వంటగదిలో వంట కోసం ఉపయోగించే బాయిలర్ ఒక్కసారిగా పేలింది. భోజన తయారీ కోసం వినియోగించే స్టీమ్ వాటర్ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలింది. అన్నం వారుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భక్తుల కోసం నిత్య అన్నదానం చేసే చోట ఇలా పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయం తెలుసుకున్న […]
శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ భక్తుల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భక్తులు కాస్త షాక్ కు గురవుతున్నారు. విషయం ఏంటంటే..? శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే కొందరు సంప్రదాయ దుస్తువులు ధరించకుండా ఇష్టమొచ్చిన దుస్తువులు ధరించుకుని గర్భగుడిలోకి ప్రవేశిస్తుంటారు. అయితే ఇలా వచ్చే భక్తుల విషయంలో తాజాగా ఆలయ కమిటీ భక్తులు సంప్రదాయ దుస్తువులు ధరించి వస్తేనే గర్భగుడిలో అనుమతి […]
శ్రీశైలం- భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపధ్యంలో డబ్బు, బంగారం, వెండి రూపంలో తమ ఇష్టదైవానికి కానుకలు ఇస్తారు. తిరుమల తిరుపతిలో ఐతే ప్రతి రోడు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తుంటారు. ఐతే చాలా వరకు ఆలయాల్లో నెలకొసారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఇదిగో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ హుండీని లెక్కించారు. శ్రీశైలం ఆలయానికి మొట్ట మొదటిసారి రికార్డు స్థాయిలో […]
శ్రీశైలం- గత కొన్ని రోజులుగా దేశంలో డ్రోన్లు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉగ్ర కార్యకలాపాల నేపధ్యంలో డ్రోన్ల కదలికలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. దీంతో అపరిచిత డ్రోన్లు ఎక్కడ కనిపించినా పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఇదిగో తాజాగా ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఓ డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఓ డ్రోన్ అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని స్థానికులు గమనించారు. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణి దగ్గర ఈ డ్రోన్ ను భక్తులు గుర్తించారు. […]
హైదరాబాద్-శ్రీశైలం- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో పర్యటించారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. అమిత్ షా కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకుచేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వార శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ […]
నల్గొండ- నాగార్జున సాగర్ రిజర్వాయర్ దగ్గర సందడి నెలకొంది. సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున వర్షాల నేపధ్యంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే నాగార్జున సాగర్ రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు, సోమవారం ఉదయం మరో 8 గేట్లను ఎత్తారు. దీంతో ప్రస్తుతం 22 గేట్ల నుంచి దిగువకు నీరు దిగువకు […]