ఇటీవల తరచుగా ఏదో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటుంది. షార్ట్ సర్యూట్, రసాయనాల పేలుడు, ఎండల వేడి వంటి ఇతర కారణాలతో ఈ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగి ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఇటీవల తరచుగా ఏదో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటుంది. షార్ట్ సర్యూట్, రసాయనాల పేలుడు, ఎండల వేడి వంటి ఇతర కారణాలతో ఈ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగి ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా భారీ ఆస్తి నష్టం కూడ జరుగుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ బైక్ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బుధవారం తెల్లవారు జామున శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని భగవతి థియేటర్ రోడ్డులో ఉన్న ఓ బైక్ షోరూమ్, హార్డ్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున్న షోరూమ్ నుంచి పొగలు రావడాన్ని స్థానిక దుకాణాల యజమానులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వాళ్లు వచ్చేసరికి షోరూమ్ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు స్థానికులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
సుమారు 70కి పైగా బైక్ లు పూర్తి దగ్ధమైనట్లు షోరూమ్ యజమానులు తెలిపారు. షోరూమ్, పక్కన ఉన్న దుకాణానికి మధ్యలో కేవలం ఓ చెక్కగోడ మాత్రమే ఉండటంతో ద్విచక్ర వాహన షోరూం నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న హార్డ్ వేర్ దుకాణంలోకి వెళ్లాయి. అందులో ఉన్న పెయింట్స్ ఇతర సామగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలు దగ్ధం అవ్వడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కోట్లలో నష్టం వాటిల్లిందని వాపోయాడు. అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.