కందకూరు, గుంటూరు తొక్కిసిలాట ప్రమాదాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రోడ్ల మీద సభలు, సమావేశాల నిర్వాహణ మీద ఆంక్షలు విధిస్తూ.. జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది అటు రాజకీయ కార్యక్రమాల మీదనే కాక.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వంటి ఫంక్షన్ల మీద కూడా ఈ జీవో ప్రభావం చూపనుంది. అసలే సంక్రాంతి సీజన్.. పెద్ద సినిమాలన్ని పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అలానే ఈ సారి సంక్రాంతికి.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 8న ఆదివారం జరగనుంది.
ఇప్పటికే ఆర్కే బీచ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజా జీవో నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి అడ్డకుంలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ ప్రిరీలిజ్ ఈవెంట్‌కి చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోలు రావడమే కాక.. స్పెషల్ గెస్ట్‌లు కూడా వస్తారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తారు. దాంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులు మీదనే ఉంటుంది.
ఇక ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఇరుకైన ప్రదేశాల్లో.. రద్దీ ఉండే ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతి లేదు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అంటే భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని.. వేరే చోటకు తరలించాలని సూచించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఆంధ్ర యూపివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్‌కి షిఫ్టయ్యింది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు.. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.
#WaltairVeerayyaTrailer out on 7th Jan 💣🔥
GRAND PRE-RELEASE EVENT on 8th Jan 🔥❤️🔥#WaltairVeerayya#WaltairVeerayyaOnJan13th pic.twitter.com/ULGZ5VElnZ
— Mythri Movie Makers (@MythriOfficial) January 6, 2023