వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుడు, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మాస్ లీడర్‌గా.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు బైరెడ్డి. తనను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని వెల్లడించాడు. మంచోడిని అని అనిపించుకుని ఎవరికీ ఉపయోగపడకుండా ఉండేదానికంటే.. రౌడీ అని అనిపించుకుని పది మందికి ఉపయోగపడటమే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు బైరెడ్డి. తాజాగా మరో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఇష్టాఇష్టాలు, పెళ్లి వంటి వాటి గురించి ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు బైరెడ్డి. ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు బైరెడ్డి సమాధానం ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘మంచి అమ్మాయి అయితే చాలు. నాకు లోకం గురించి తెలియకముందు.. నేను మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలని కోరుకునే ఆప్షన్ ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. నన్ను ఇష్టపడి.. నా కష్టసుఖాల్లో భాగం పంచుకునే అమ్మాయి.. నా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నాను’’ అన్నాడు. మరి లవ్ మ్యారేజా.. ఆరెంజ్డ్ మ్యారేజా అన్న ప్రశ్నకు.. చేసుకున్నప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఇక ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎంతో రుణపడి ఉంటానని.. నందికొట్కూర్కే తన జీవితం అంకితం అని తెలిపాడు. ఇంతమంది అభిమానిస్తున్నారు కదా అని నేనే తోపు అనుకోను. కానీ పది మందికి సాయం చేస్తే.. వచ్చే సంతృప్తి వేరు. ఈ ఫేమ్ ఇవన్ని నీటి మీద బుడగలాంటివి అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.