పశ్చిమ గోదావారి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు జల్లేరు వాగులో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను స్థానికులు బయటికి తీశారు. మరికొంత మంది నీటి ప్రవాహంలో గల్లంతైనట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గురైన ప్రదేశంలో స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది.