సాధారణంగా తన రక్త సంబంధింకులతో మాత్రమే మనుషులు ప్రేమానురాగాలు పెంచుకుంటారు. అలా తన వారికి చేసే ఏ వేడుకైన ఘనం చేస్తుంటారు. అలా ఇంట్లో పిల్లాడు పుట్టాడు అంటే ఇక ఆ కుటుంబ సభ్యులు చేసే సందడి మాములుగా ఉండదు. ఆ చిన్నారి బారసాల వేడుకను ఘనంగా చేస్తుంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే అతి సాధారణ కార్యక్రమం. అయితే కొందరు అయితే తమ పశువులను కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అలా భావించిన కాకినాడకు చెందిన గౌరీశేఖర్ తన ఇంట్లో జన్మించిన ఆవుదూడకు బారసాల మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం స్థానికంగా ఈ వార్త వైరల్ అవుతోంది. మరి… ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుకుందాం..
కాకినాడ లోని రమణయ్యపేటకు చెందిన గౌరీ శేఖర్ వృతిరీత్యా వైద్యుడు. ఆయన భార్య రమదేవి, ఇద్దరు కుమార్తెలు కూడా వైద్యులుగానే స్థిరపడ్డారు. ఇంట్లోని ఆస్పత్రిని నిర్వహిస్తున్న గౌరీశేఖర్ కు చిన్నప్పటి నుంచి ఆవులన్న, వాటిని పెంచడం చాలా ఇష్టం. తన కుటుంబ సభ్యులు పశువులను పెంచడం చూస్తూ పెరిగిన శేఖర్ కూడా వాటిపై మక్కువ పెంచుకున్నారు. అనేక రకాల ఆవులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సుమారు రూ.50 వేలకు పుంగనూరు జాతి ఆవుదూడను కొనుగోలు చేశారు. దానికి మూడో నెల వయస్సు రావడంతో బుధవారం బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో కుటుంబ సభ్యుల మరియు బంధుమిత్రులతో సమక్షంలో జరిగిన ఈ వేడక జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలో వైరల్ అవుతోంది.
“నా బారసాలకు రండి” అంటూ ఆ ఆవుదూడ పిలిచినట్టుగా ఓ ఆహ్వాన వీడియోను తయారు చేశారు. ఈ బారసాలకు వచ్చిన బంధువులు కూడా ఆవుదూడతో గౌరీశేఖర్ కుటుంబాన్నికి ఉన్న అనుబంధాన్ని చూసి ఎమోషన్ అయ్యారు. ఆవు దూడ మెడకు గంటల దండ, కాళ్లకు పట్టీలతో చక్కగా అలకరించి పూజలు చేశారు. అనంతరం ఊయలలో ఉంచి ఊపుతూ మంత్రోచ్చరణ చేయించి, ఆశీర్వచనలు ఇచ్చారు. అయితే ఇలా ఆవుదూడకు బారసాల చేసిన గౌరీ శేఖర్ ను అడబాల అనే ట్రస్టు వారు సన్మానించారు. మరి… ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి