సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు పెంచేందుకు నిర్ణంయ తీసుకుంది. సంక్రాంతి స్పెషల్ సర్వీసులను నడపనుంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని 1266 అదనపు బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 7 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్, చెన్నై, విశాఖ, విజయనగరం, బెంగళూరు, శ్రీకాకుళం ఇలా డిమాండ్ ను బట్టి అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు మాత్రం 50 శాతం అదనంగా ఉండనున్నట్లు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అత్యధికంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బెంగళూరుకు 14, చెన్నైకి 20 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులను అదనంగా నడపనున్నారు. విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు అదనంగా నడవనున్నాయి. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అనదనంగా ఛార్జ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.